Saturday, November 5, 2011

తెలంగాణా ఉద్యోగుల సమ్మె- సమీక్ష

గ్లోబలైజేషన్ వచ్చింది అన్నింటినీ మింగేసింది అని అనుకొన్నాను. యిజాలన్నిటికీ కాలం చెల్లిందనేది యెంత తప్పుడు భావనో తెలంగాణా పోరాటాణ్ణి చూస్తే తెలుస్తుంది. యెవనిది వాడు చూసుకొనే కాలం ఇది, పోరాటాలకు కాలం చెల్లిందకొని పొరబడ్డాను.

మేము (ప్రభుత్వ ఉద్యోగులము) చేసిన సమ్మె తో చాలా నమ్మకం పెరిగింది. చిన్న ఉద్యోగస్తుని దగ్గరి నుండి జిల్లా స్థాయి అధికారుల వరకు కూడా అదే స్ఫూర్తితో సమ్మెలో పాల్గొన్నారు. యేస్థాయి వారైనా కూడా జీతాలు రావట్లేదు కాబట్టి సమ్మెను ఆపుదాము అనలేదు.

సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మాకోలీగ్స్ కూడా సమ్మెలో పాల్గొన్నారు. కొన్ని చోట్లలో గ్రామాల్లో తిరిగి ప్రత్యేక తెలంగాణా ఆవశ్యకతను స్వయంగా ప్రచారం కూడా చేశారు. తెలంగాణా జోన్లలో రిక్రూటయిన పాపానికి ఆంధ్రా ప్రాంతానికి చెందినవారైనప్పటికీ వారు ప్రమోషన్లలో ఎదుర్కొంటున్న వివక్షను మాకంటే బాగా గుర్తించారు.


ఉద్యోగస్తుల సమ్మెతో తెలంగాణా వస్తుందా అని కొందరన్నారు. కానీ ఉద్యోగస్తుల సమ్మెతో తెలంగాణా వాదం మామూలు ఓటరు స్థాయి దాకా బలంగా చేరింది. సమ్మెతో రాజకీయ వర్గాలపై వత్తిడి పెరిగింది. యెవరు యేమి మోసాలు చేస్తున్నారో ప్రజలకు బాగా అర్ధం అయింది. ఆ విధంగా సమ్మె విజయవంతమైనట్లే లెక్క.















4 comments:

  1. This is complete stupidity. Where was the strike(or 'samme')? If the employees are confident that they can get their salaries and other benefits, even if they do not work - obviously evrey one participates in strike --- getting paid with out working is always GOOD. Telangana won't come with employee's strike..NOTE THIS CLEARLY! And if you believe other wise, then there is some problem...think about it by your self!
    Do you know, why you went on the strike, and why you called off the strike? Did you get YOUR telangana to call off your strike...or any concrete promise on telangana....THINK...THINK...THINK! Don't get excited and fill the blog pages, simply because you have a blog and internet connection!!!!!!

    ReplyDelete
  2. అబ్బ చా

    ReplyDelete
  3. ఈ దిక్కుమాలిన సమ్మెతో సాధించినదేముంది. నెలన్నర రోజులు ప్రజలను హింసించి పనిచేయకుండా జీతాలు తీసుకోవటం తప్ప. ఏంది మీరు చేసిన బోడి త్యాగం.

    ReplyDelete
  4. తెలంగాణా అన్నా, మన ప్రజలన్నా జోక్ గా చూసే ప్రభుత్వం ముందు సమ్మెని సీరియస్ గా తీసుకోలేదు. సమ్మె ప్రభావానికి వీరికి దిమ్మె తిరిగింది.

    తెలంగాణా రాష్ట్రసాధనలో భాగంగా పోరాడి, మన సత్తా ప్రపంచానికి చాటి చెప్పిన మన ఉద్యోగాలందరికీ అభినందనలు.

    Jai Telangana, Bharat Mata ki jay ho, RIP andhera pradesh!

    ReplyDelete