Tuesday, March 16, 2010

తెలంగాణ-సీమాంధ్ర నేతల మధ్యనున్న అంతరం?


డిసెంబరు 9 వతేదీ నాటి కేంద్ర హోంమంత్రి గారి ప్రకటన తర్వాత సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలంతా కలసికట్టుగా మొత్తానికి మొత్తంగా రాజీనామాలు సమర్పించారు. తర్వాత కేంద్రం మాట మార్చినప్పుడు అదే స్థాయి స్పందన తెలంగాణ ప్రజాప్రతినిధులు కనపరచ లేక పోయారు. దీనికి రెండు ప్రాంతాల మధ్యనున్న ఆర్ధిక, రాజకీయ అంతరమే కారణం.

సీమాంధ్ర, తెలంగాణ నేతల మధ్యకూడా ఆ ప్రాంతాల మధ్యనున్నంత ఆర్ధిక ఆంతరం ఉంది. సీమాధ్ర నేతలకి ఈ పాటికే సరిపోను ఎస్టాబ్లిష్డ్‌ వ్యాపార, రియల్‌ ఎస్టేట్‌ సామ్రాజ్యాలు ఉన్నాయి. వారికి ఈ ఎంపీ, ఎమ్మెల్యే సీట్లొక లెక్కలోవి కావు. మళ్ళీ ఎన్నికలొచ్చినా సీట్లూ, ఓట్లూ తేలిగ్గా కొనుక్కోగల ఆర్ధిక సామర్ధ్యం వారికి ఉంది. అందుచేత వారికి రాజీనామాలొక లెక్కలోనివి కావు.

మెజార్టీ తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేల ఆర్ధిక పరిస్థితి అంత కాంక్రీట్‌గా లేకపోవడం వలననే వారు అంత సాహసంగా రాజీనామాలు చేయలేక పోయారు. సెంటిమెంటు మీద ఆధారపడిన టి.ఆర్‌.యస్‌. ఎమ్మెల్యేలకు దీనిలో కొంత మినహాయింపు ఉంది. మిగతా వారంతా ఎన్నికల్లో అంతో ఇంతో ఖర్చు చేసి పదవుల్లోకి వచ్చారు. ఇంత స్వల్ప వ్యవధిలో మళ్ళీ ఎన్నికలొస్తే వారి ఆర్ధిక పరిస్థితి దానిని తట్టుకో గల స్థాయిలో లేదు. అందుకనే వారు పదవులు వదులుకోవడానికి సిద్దపడలేక పోతున్నారు.

తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల మధ్యకూడా ఈ అంతరాలు వాటి నేతల మధ్యనున్నంత స్థాయిలోనే ఉన్నాయి.


సీమాంధ్ర నేతలకున్న పెట్టుబళ్ళు, వ్యాపార సామ్రాజ్యాలే వారి బలం. సమెక్యాంధ్ర అని నినదించే వారి వెనుక ఆ ప్రాంత ప్రజాకాంక్షల కంటే వారి పెట్టుబళ్ళ బలమే ఎక్కువ. ఆ పెట్టుబళ్ళలో సింహ భాగం వారు హెదరాబాద్‌లో పెట్టి ఉండడం వలన సమస్య ఇంకా జటిలంగా మారింది. వారి ఆర్ధిక బలం ముందు తెలంగాణ రాజకీయ బలం తట్టుకొని నిలువలేక పోతుంది.

కాబట్టి తెలంగాణ వాదులు రాజకీయ ప్రక్రియల కంటే ప్రజా పోరాటాలను నమ్ముకోవడమే మంచిది.

10 comments:

 1. అవును మరి తెలంగాణ ప్రజాప్రతినిధులు అమాయకులు చాలా పేద వాళ్లు పాపం ....

  ReplyDelete
 2. నేను మీ అబిప్రాయం తొ పూర్తిగా ఎకిబవవిస్తున్నాను

  ReplyDelete
 3. Very nicely said. "ప్రజాకాంక్షల కంటే వారి పెట్టుబళ్ళ బలమే ఎక్కువ..."

  It doesn't matter where, this is true in almost all regions in AP - Common peoples interests are nothing for every dominion leader and politician. It is scary... and one of the root cause of many agitations including Telangana merger and division.

  Well said... Mr.Reddy

  ReplyDelete
 4. దీనిని బట్టి మనకు తెలిసింది ఏమిటంటె, ముందు తెలంగాఱ నాయకులు బాగా సంపాదించి, అప్పుడు తెలంగాఱ కోసం పొరాటం చెయ్యాలి.
  తెలంగాఱ నాయకులు బాగా సంపాదించాలి అంటే, వాళ్ళకు తెలంగాఱ రావాలి.

  ReplyDelete
 5. money kosam padhavulu vadhulukoleni rajakeeya nayakula kosa, prajulu poradala? telangana vasthe, ee telangana politicans ardikamga bagupadataniki..

  ReplyDelete
 6. తెలంగాణా ఉద్యమం తెలబాన్లు మద్యమకారుడు, మెంటల్ మేధావులు చేస్తున్న ముండమోపి ఉద్యమం. తెలుగుజాతిని నాశనానికే ఈ ముష్టి ఉద్యమం పుట్టింది.

  ReplyDelete
 7. నిజం చెప్పారు.సమైక్యాంధ్ర పిలుపు వెనక తెలుగు జాతి సంక్షేమం లేదు.కావాలంటే హైదరబాద్ ని వదిలి తెలంగాణా తీసుకోండి అని రాయపాటి సాంబశివరావు చేసిన సవాలు ఇందుకు నిదర్శనం.

  ReplyDelete
 8. "సమైక్యాంధ్ర పిలుపు వెనక తెలుగు జాతి సంక్షేమం లేదు" నిజమే , అలాగే తెలంగాణా ఉద్యమం లో, ఆ ఉద్యమ నాయకత్వం లో తెలంగాణా అభివృద్ది ఆకాన్ష ఉంది అంటారా? నిజంగా ఉంటే, ఆ ఉద్యమ నాయకులు తెలంగాణా ప్రజలకోసం వాళ్ల వాళ్ల పరిధిలో, నిధులతో ఏమి అభివృద్ది చేసారో ఇన్నాళ్లు, ప్రస్తుతం తెలంగాణా సమస్యల మీద ఎంత పోరాడుతున్నరో చెప్తారా?

  ఇద్దరికీ కావాల్సింది హైదరాబాద్ నుండి వస్తున్న ఆదాయం, దాని మీద పెత్తనం, నిజానికి తెలంగాణా నాయకులు స్వయం పరిపాలన గాడిద గుడ్డు కావాలంటే, హైదరాబాద్ అవసరమా?

  అలాగే రాయపాటి అన్నట్లు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగానో, కేంద్ర ప్రాంత పాలిత ప్రాంతం గానో చెస్తే అందరూ కాకున్నా, కొంతమంది కొస్తా, సీమ వాళ్ళు, తమ స్తాండ్ మార్చుకోవచ్చు.

  మనమందరం గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటి అంటే ముక్కు దొర కాని, కోదండరం దొర గారు కాని, జగడపాటి, రాయపాటి కాని తెలంగాణా ప్రజలకోసమో, కోస్తా ప్రజలకోసమో చేసింది ఏమీ లేదు, తమ తమ సంతానానికి పోగేసుకోవటం తప్ప అని. ఇలాంటి నాయకుల నాయకత్వాలలో తెలంగాణా, సీమా అంటూ మనం కొట్టుకోవటం, కాల్చుకోవటం, తగలెట్టుకొని కన్న వాళ్లకు, కట్టుకొన్న వాళ్ళకు శోకం మిగిల్చి, ప్రాంతాలతో సంబంధం లేకుండా మంచి గొఱ్ఱె లమని నిరూపించుకోవటం!!!

  ReplyDelete
 9. అవును. సీమాంధ్ర, తెలంగాణాల మధ్య ఉన్న అంతరం ప్రజాప్రతినిధుల మధ్యకూడా ఉన్నది. కాని తెలంగాణ ప్రజాప్రతినిధులు దానిని గుర్తించడం లేదు. వాళ్లు పూర్తిగా వ్యాపారవ్యసనం లొ కూరుకపోయినారు. వాళ్లకు ఆత్మగౌరవం లేదు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు అమ్ముడు పోయినారు.
  చాలామంది సీమాంధ్ర, తెలంగాణ ప్రజాప్రతినిధులు వ్యాపారభాగస్వామ్యులు, సిండికేటైన వ్యాపారులు, ఆర్గనైదెడ్ ప్రొఫెషనల్ దళారులు. వీరందరికి దోచుకోవటానికి పెద్ద సామ్రాజ్యం కావాలి. అందులొ తెలంగాణ ప్రజాప్రతినిధులుకు చిన్నవాటాదారులు. వీరికి ప్రజాక్షేమం గురించి ఆలోచన లేదు. సీమాంధ్ర సామాన్య ప్రజలకు సమైక్యాంధ్ర ఆకాంక్ష ఏమి లేదు. వాళ్లు నిమిత్తమాత్రులు. తెలంగాణ సామాన్యులకే తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష ఉన్నది. తెలంగాణ ప్రజలు ఈ రెండు ప్రాంతాల దళారి ప్రజాప్రతినిధులపై పోరాడాలి. తెలంగాణా కోరకే కాదు, కొత్త నాయకత్వం కోరకు పోరాటం చేయాలి. సీమాంధ్ర ప్రజలు ఈ పోరాటానికి మద్ధతు ఇవ్వాలి. ఇస్తారు కూడా. ప్రజలు గుర్తిస్తున్నారు. ఇది జరగబోయె పరిణామమె.

  ReplyDelete
 10. మీ బ్లాగు బాగుంది. మరి నా బ్లాగూ చూస్తారా!!
  www.iandsahachara.blogspot.com

  ReplyDelete