ఎక్కడ చూసినా పత్తి పంటే. నేషనల్ హైవే వెంట నుండి మారుమూల చందంపేట లోపల పొగిళ్ళ దాకా పత్తి పంటే. భూములన్నిటా పత్తే పెడితే తిండి పండించడం ఎక్కడో? పత్తి ఎగుమతి చేసి తిండి గింజలు దిగుమతి చేసుకోవాలా? గిరిజనుల సాంప్రదాయక ఆహారం జొన్న రొట్టె. చందంపేట మండలమైనా, దేవరకొండ మొత్తమైనా ఎక్కడా జొన్న చేను కనపడదు. మహారాష్ట్ర నుండి లారీల కొలది దిగుమతి చేసుకొంటారట .
ఎందుకు ఇంత పత్తి ? ఇన్ని బట్టలు కావాలా? వనరులను పొదుపుగా వాడుకోవాలి. పెట్టుబడులు లాభాలు నష్టాలు లెక్కలు ఎక్కువైపోయి ఆత్మహత్యలు.
పెసర చేలు కూడా కంటికి కనపడడం లేదు. ఏం తిని బతుకుదామో అర్ధం కాదు. ఆ పంట కొంత ఈ పంట కొంత ఇలా రకరకాల పంటలు వేస్తే ఎదో ఒక్కటైనా ఆదుకోక పోదు. వైవిధ్యం అవసరం.

No comments:
Post a Comment