పండుగలు, నవరాత్రులు, పెళ్ళిళ్ళు, చావులు, ఊరేగింపులు, మీటింగులు
ఒకటని ఏమిటి అన్నిటికి లౌడ్ స్పీకర్లు లేకుంటే
డోలు వాయిద్యాలు, సిరీస్ బాంబులు సాధారణమై పోయాయి ఈ రోజుల్లో.
సినిమాలకెళ్ళినా అంతే. అంతా అతి ధ్వనులే.
సాధారణ స్థాయిలో ఉన్న ధ్వనుల్ని ఎంజాయ్ చెయ్యొచ్చు కానీ ఈ కాలుష్య
స్థాయిని ఎంజాయ్ కాదు కదా చెవులు మూసుకోవాల్సి వస్తుంది.
ఇదివరకు బ్యాండు మేళంలో తోలుతో చేసిన డోళ్ళు,
డప్పులు వాయించే వారు. అది మంద్రంగా ఉండి అంత విసుగనిపించేది కాదు. డుం.. డుడుం ..
శబ్దం వచ్చేది బాగానే ఉండేది. ఇప్పుడు తోలు స్థానంలో ప్లాస్టిక్ మెంబ్రేన్ వాడడం వలన
కర్ణకఠోరమైన మెటాలిక్ సౌండ్ వస్తుంది. టం... టటం.... శబ్దం భరించలేని స్థాయిలో వస్తుంది.
తాష అనే డప్పు వలన ఈ శబ్దం అధికంగా ఉంటుంది. ఒక్కడు కాదు ముగ్గురు
బాత్తోంటే చెవులు గిల్లు మంటున్నాయి. ఈ సాంప్రదాయం హైదారాబాద్ లో ఎక్కువగా ఉండి అన్ని
జిల్లాలకు పాకింది. ఇదెక్కడి హింసో అర్దం కాదు. మామూలు తోలు డప్పులు,
తబలా, మృదంగం, సన్నాయి డోలక్ ల ధ్వని ఎంతో
సొంపుగా ఉండే సాంప్రదాయాన్ని వదిలేసి ఈ స్థాయి మెటాలిక్ సౌండ్స్ పెట్టడం హింస కిందికే
వస్తుంది.
దీని విషయమై ఆలోచించాలి.