ఇదెక్కడి గొడవండీ బాబూ.తెలుగు వాళ్ళకుఇంకో రాజధానిని ఇస్తామని పెద్దోళ్ళు అంటే సంతోషించాలి గానీ హైదారాబాద్ ని దేశానికి రెండో రాజధానిని చేయాలని మాట్లాడతారేమిటి? మనకు ఇంకో ఇల్లు కట్టుకొనే అవకాశం వచ్చిందని సంతోషిస్తాం. దాన్ని ఎలా కట్టుకోవాలో ప్లాన్లు వేస్తాం. కలలు కంటాం. ఇదేంది. యేం పాడైందని హైదారాబాద్ లో. అందరం యెగబడి ఖరాబు చేయడం కాకపోతే. రెండు మూడొందల కిలోమీటర్ల అనవసర ప్రయాణం తప్పితే. కోట్ల రూపాయల ఫ్లాటు ఉండి యేం లాభం చుక్క నీరు దొరక్కుంటే. పేద్ద కారుంటే యేం లాభం దానికి తగ్గ రోడ్లే లేకుంటే. దాన్ని ఆపడానికి జాగానే లేకుంటే. నిమిషానికి గజం వేగంతో కారులోనే పోవాలా. యెవడు గుద్దుతాడో, యెవనికి మనం గుద్దుతామో. టెన్షన్ తో నడపడమే కదా? డబ్బులు గణించుకోవడమే కానీ జీవన నాణ్యత అవసరం లేదా?
కొత్త రాజధానిలో నైనా స్థలాలు, వ్యాపారాలు దొరుకుతాయి కదా. ఎక్కడ సెక్రటేరియట్ ఉండాలి. ఎక్కడ నివాసాలు ఉండాలి. పార్కులెక్కడ ఉండాలి. ఇవి ఆలోచించాలి. అన్ని రంగాలను ఇప్పటికైనా ఒకే చోట కుప్ప పోయకూడదనే తెలివిడి తెచ్చుకోవాలి. కొత్త రాష్ట్రానికి ఒకటి కాకపోతే రెండు రాజధానులు ఉండాలి. పరిపాలన వసతులు మాత్రమే అక్కడ నిర్మించుకోవాలి. విద్యా రంగం వేరే ఊళ్ళో , పారిశ్రామిక రంగం ఇంకొకచోట, ఐ.టి. పార్కులు ఒక టౌనులో ఇలా వికేంద్రీకరణ తప్పకా జరగాలి. లేకుంటే ఈ ఇరుకులు మురికి తప్పవు.
అసలు తెలుగువాళ్ళకు ఇదేం వెర్రి? అప్పుడేమో పోయి పోయి మద్రాసులో పడ్డారు. అసలు సినిమా రంగంలోని మెజారిటీ జనమంతా కృష్ణా, గోదావరి జిల్లాల వాళ్ళే కదా. యే రాజమండ్రిలోనో స్టూడియోలు నిర్మించుకోవచ్చు కదా? కళల కాణాచి పేరు సార్ధకమయ్యేది కదా? ఇప్పుడేమో హైదారాబాద్ లో పడి కొట్టుకులాడుతున్నరు. కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా మొదలు విజయవాడ, గుంటూరు, నెల్లూరుల్లో వెలిశాయి. అక్కడే ఉంటే పోక వాళ్ళూ హైదారాబాద్ దారి పట్టిరి. మనకు దగ్గరగా మనం పెట్టుబళ్ళు పెట్టుకొంటే లాభమే కానీ నష్టం ఉండదు కదా.
ఇక ప్రభుత్వోద్యోగులకు ట్రాన్స్ఫర్లు తప్పవు కదా. అదీ తమ ఊరికి దగ్గరకి అంటే సంతోషించాలి. వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు సేవకు అందుబాటులో ఉండొచ్చు. బంధు మిత్రుల మధ్యన ఉండొచ్చు. ఎంతైనా సొంత ఊరిపై మమకారం ఉంటుంది కదా. ఉద్యోగాలు యేమీ తీసెయ్యరు కదా. యెందుకింత గొడవో అర్ధం కాదు.